Tue Jan 27 2026 04:45:09 GMT+0000 (Coordinated Universal Time)
భట్టి ఇంట్లో మంత్రుల భేటీపై పీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో మంత్రుల భేటీపై పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ స్పందించారు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో మంత్రుల భేటీపై పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు కాబట్టే పాలన అంశంలో మంత్రులు సమావేశం జరిపితే తప్పులేదని మహేష్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌లో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందేనని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన...
ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహేష్‌కుమార్ కోరారు. హరీష్‌రావు, కేటీఆర్ కలిసి కొందరి లబ్ధికోసం వారి హయాంలో కాంట్రాక్టులు ఇచ్చారని మహేష్‌కుమార్ తెలిపారు. విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని, విచారణ తర్వాత ఎవరెవరి ప్రమేయం ఉందో తెలుస్తుందని ఆయన అన్నారు.
Next Story

