Sat Dec 06 2025 02:10:18 GMT+0000 (Coordinated Universal Time)
Revanth reddy : డీజీపీకి రేవంత్ లేఖ.. తన భద్రతపై
భద్రతపై తెలంగాణ డీజీపీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం భద్రతను పెంచాలన్నారు

భద్రతపై తెలంగాణ డీజీపీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం తనకు భద్రతను పెంచాలని కోరుతూ ఆయన లేఖలో కోరారు. సెక్యూరిటీ పెంచకుంటే తాను తిరిగి హైకోర్టును ఆశ్రయిస్తానని కూడా రేవంత్ రెడ్డి డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తనకు 6+6 సెక్యూరిటీ కల్పించాలని లేఖలో కోరారు.
సెక్యూరిటీని పెంచాలంటూ...
తెలంగాణ ఎన్నికల సమయంలో తన భద్రత పట్ల రేవంత్ రెడ్డి కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర మంతటా పర్యటించాల్సి రావడంతో తనకు భద్రతను పెంచాలని ఆయన డీజీపీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. కోర్టు ఆదేశాలను మాత్రమే తాను అమలు చేయాలని కోరుతున్నట్లు రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొనడం గమనార్హం.
Next Story

