Sat Mar 07 2026 18:12:38 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7.45 గంటలకు మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో 9.20 గంటలకు చేరుకుంటారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి కొండగట్టుకు చేరుకుంటారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన...
ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ పవన్ కల్యాణ్ కొండగట్టులో ఉంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో చేపట్టిన అభివృద్ధి పనులకు కొండగట్టు ఆలయ ప్రాంగణంలో పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జనసేన తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

