Sat Mar 07 2026 21:32:14 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేరుకున్నారు

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల వసతుల కోసం నిర్మించనున్న 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మందిరానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నిర్మాణాలకు భక్తుల విరాళాల ద్వారా రూ.35.19 కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.
భారీ బందోబస్తు...
కొండగట్టు ఆలయ సందర్శనానికి పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఆలయ దర్శనం అనంతరం నాచుపల్లిలోని ఓ రిసార్ట్లో జనసేన పార్టీ కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నానికి హైదరాబాద్కు తిరిగివెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Next Story

