Thu Mar 19 2026 20:34:33 GMT+0530 (India Standard Time)
తెలంగాణ ప్రజలను అలా అంటారా?
వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను వైసీపీ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు

వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను వైసీపీ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఏపీ మంత్రులు స్పందించిన తీరు అభ్యంతర కరమని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
మంత్రులు వెనక్కు తీసుకోవాలి....
హరీశ్‌రావు ఏ కంటెంట్‌లో అన్నారో తెలియదు కాని ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఒక జాతిని అవమానిస్తుంటే సీనియర్లు ఏంచేస్తున్నారని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. మంత్రులు తమ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు.
Next Story

