Thu Jan 29 2026 13:26:43 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియాంకతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ సమావేశమై మునుగోడు ఉప ఎన్నికలపై చర్చించారు

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ సమావేశమై మునుగోడు ఉప ఎన్నికలపై చర్చించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వ్యూహం వరకూ నేతలతో చర్చించారు. నేతల మధ్య ఉన్న విభేదాలను సయితం ప్రియాంకగాంధీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలుపుకుని వెళ్లాలని ప్రియాంక గాంధీ హాజరైన నేతలకు వారికి సూచించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.
వర్గపోరును పక్కనపెట్టి..
వర్గపోరును పక్కనపెట్టి ఐక్యతతో పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారు. అభ్యర్థి ఎంపికలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. సామాజికవర్గాల పరంగా మాత్రమే కాకుండా అన్ని రకాలుగా చూసి అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్రియాంక గాంధీ సూచించారు. ఈ సమావేశానికి పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మధు యాష్కి తదితరులు హాజరయ్యారు.
Next Story

