Fri Feb 13 2026 19:54:30 GMT+0530 (India Standard Time)
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గెలుపెవరిదంటే?
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా మారిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా మారిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. స్పీకర్ గడ్డం ప్రసాదరావు పార్టీ మారడానికి ఆధారాల్లేవని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం పదే పదే వారు పార్టీ మారారని అంటుంది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఐదు చోట్ల మాత్రమే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఐదింటిలో మూడు నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. రెండు స్థానంలో మాత్రం హంగ్ ఏర్పడింది.
స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్...
కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మున్సిపాలిటీని గెలుచుకుంది. కడియం శ్రీహరి కుమార్తె కావ్య గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే కడియం శ్రీహరి విషయంలో ఇంకా స్పీకర్ తీర్పు వెలువరించలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తీర్పు వెలువరించే అవకాశముంది. అనధికారికంగా చూస్తే కడియం శ్రీహరి కాంగ్రెస్ కు మద్దతుదారుగానే ఉన్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు.
పోచారం ఇలాకాలోనూ...
బాన్సు వాడలోనూ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ మద్దతుదారుగా నిలిచారు. అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాలె యాదయ్య కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వైపు వెళ్లారు. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి మున్సిపాలిలిటీని సొంతం చేసుకున్నారు. కానీ గద్వాల్ నియోజకవర్గంలో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నేతృత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవలేదు.హంగ్ ఏర్పడింది. జగిత్యాలలోనూ సంజీవ్ కుమార్ కు, సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గాల మధ్య పోరు జరిగింది. దీంతో ఇక్కడ కూడా స్పష్టమైన మెజారిలటీ రాలేదు. ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించినట్లయింది.
Next Story

