Sun Mar 08 2026 01:29:44 GMT+0530 (India Standard Time)
BRS : తెలంగాణ భవన్ లో నేడు కీలక భేటీ
బీఆర్ఎస్ అభ్యర్థులతో నేడు తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థులతో నేడు తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫారాలతో పాటు 95 లక్షల రూపాయల చెక్కును పార్టీ తరుపున అందచేయనున్నారు. నేటి నుంచి తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుండటంతో తెలంగాణ భవన్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బీఫారాలు...
ఎన్నికల వ్యయంకోసం బీఆర్ఎస్ అధినేత అభ్యర్థులకు పార్టీ తరుపున చెక్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో పాటు బీఫారాలు ఇస్తారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో వారు తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారాన్ని చేసుకునేందుకు వీలుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

