Sun Mar 15 2026 19:07:54 GMT+0530 (India Standard Time)
లీడర్లకు తేల్చి చెప్పిన కేసీఆర్
భారత రాష్ట్ర సమితి సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని తేల్చిచెప్పారు

భారత రాష్ట్ర సమితి సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని నేతలకు కేసీఆర్ తేల్చిచెప్పారు. షెడ్యూల్ ప్రకారమే డిసెంబరు నెలలో ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ నేతలకు మరోసారి తెలిపారు. అయితే ఈ ఎనిమిది నెలలు ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్ నేతను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలన్నారు.
ప్రజల్లోనే ఉండాలి...
అలాగే నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించుకుని నేతల మధ్య విభేదాలుంటే పరిష్కరించుకోవాలని కూడా సమావేశంలో సూచించినట్లు సమాచారం. విభేదాలు ముదరకుండా పార్టీ నేతలను అందరిని కలుపుకుని వెళ్లేలా వ్యవహరించాలని ఆదేశించారు. ఐక్యంగా ఎన్నికలకు వెళితేనే గెలుపు సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. నేతలు తమ నియోజకవర్గంలో పాదయాత్రలు కూడా చేస్తే మంచిదని తెలిపారు.
Next Story

