Thu Mar 19 2026 17:51:57 GMT+0530 (India Standard Time)
బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం నేడు
భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ సమావేశం నేడు కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది

భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఎంపీలతో చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో లేవనెత్తిన అంశాలపై చర్చిస్తారు.
దిశానిర్దేశం....
లోక్ సభ, రాజ్యసభలో ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలి? ఏ డిమాండ్లను తీసుకురావాలి? ప్రధానంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించేందుకు ఈ సమావేశాలను అవకాశంగా మలచుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

