Wed Jan 21 2026 08:56:06 GMT+0000 (Coordinated Universal Time)
స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి.. సోనియా ప్రకటన
ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దృష్టి పెట్టినట్లే కన్పిస్తుంది. పార్టీలో సీనియర్లకు అవకాశాలను వివిధ పదవుల ద్వారా కల్పించాలని నిర్ణయించినట్లు కనపడుతుంది. పీసీసీకి సహకరించేలా సీనియర్ నేతలకు ఏదో ఒక పదవిని ఇచ్చి వారిని యాక్టివ్ చేయాలని సోనియా గాంధీ భావిస్తున్నారు.
సీనియర్ నేతలకు...
ఇందులో భాగంగా ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఏఐసీసీ నుంచి ఒక ప్రకటన విడుదలయింది. మరికొందరు సీనియర్ నేతలకు కూడా త్వరలో కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

