Thu Mar 19 2026 22:59:41 GMT+0530 (India Standard Time)
Telangana : నేటి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది

తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలవుతుంది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా తొలి దశ ఎన్నికలు 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకూ అభ్యర్థుల నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.
11న పోలింగ్...
30వ తేదీన నామినేషన్ల స్క్కూటినీ చేపడతారు. డిసెంబరు 1వ తేదీన అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2వ తేదీన పరిష్కరిస్తారు. మూడో తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియనుంది. మూడో తేదీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. డిసెంబరు 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికతో పాటు ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.
Next Story

