Thu Dec 18 2025 10:09:56 GMT+0000 (Coordinated Universal Time)
కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన స్రవంతి
కౌంటింగ్ కేంద్రం నుంచి పాల్వాయి స్రవంతి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు రావడంతో ఆమె నిరాశకు గురయ్యారు

మునుగోడు కౌంటింగ్ కేంద్రం నుంచి పాల్వాయి స్రవంతి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు పోల్ కావడంతో ఆమె నిరాశకు గురయ్యారు. అయితే పాల్వాయి స్రవంతి వేరే పనిమీద బయటకు వెళ్లారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికి మునుగోడు ఉప ఎన్నికల్లో రెండు రౌండ్లు పూర్తయ్యాయి.
రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి...
రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ 563 ఓట్ల ఆధిక్యంతో ఉంది. ఇంకా చౌటుప్పల్ లో అర్బన్ ప్రాంతాల్లో లెక్కింపు జరగాల్సి ఉంది. ఇక్కడ బీజేపీ ఆధిక్యత కనపర్చే అవకాశం కనిపించింది. రెండో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం కనపర్చడంతో ఆ పార్టీలో కొంత ఆశలు చిగురించాయి.
Next Story

