Thu Jul 07 2022 07:08:26 GMT+0000 (Coordinated Universal Time)
ఐసీయూలో పద్మశ్రీ వనజీవి రామయ్య

పద్మశ్రీ వనజీవి రామయ్య ఆసుపత్రి పాలయ్యారు. ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. రామయ్య బుధవారం ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ బైక్ వచ్చి రామయ్యను ఢీకొట్టింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూ ఉంచి చికిత్స అందిస్తున్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య ఆరోగ్యంపై ఎంపీ సంతోష్ కుమార్ ఆరా తీశారు. డాక్టర్ ల తో మాట్లాడిన ఎంపీ సంతోష్ కుమార్.. రామయ్య ఆరోగ్యం మెరుగు అయ్యేందుకు అవసరమైన అన్ని వైద్య చర్యలు తీసుకోవాలని సూచించారు.
వనజీవి రామయ్యకు గతంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చేర్చి వైద్యులు ప్రత్యేక వైద్య సేవలందించారు. ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో రామయ్య ఇబ్బంది పడుతున్నారని గతేడాది వైద్యులు తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని రామయ్యకు సూచించారు. గతేడాది ఫిబ్రవరిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రిలో చేరిన రామయ్య అనంతరం కోలుకున్నారు.
- Tags
- Vanjeevi Ramaiah
Next Story