Fri Dec 05 2025 18:40:08 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే చోట రేవంత్, షర్మిల పాదయాత్ర
ఈరోజు సాయంత్రానికి అటు వైఎస్ షర్మిల, ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల పాదయాత్ర పాలకుర్తికి చేరుకోనుంది

పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్రల టెన్షన్ మొదలయింది. ఈరోజు సాయంత్రానికి అటు వైఎస్ షర్మిల, ఇటు పీీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల పాదయాత్ర పాలకుర్తికి చేరుకోనుంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్టీపీ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో హాత్ హాత్ సే జోడో కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టారు.
ఎదురుపడకుండా....
ఇద్దరు నేతల పాదయాత్రలు ఒకే రోజు పాలకుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఎదురుపడకుండా అవసరమైన చర్యలు పోలీసులు తీసుకుంటున్నారు. భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

