Wed Jan 28 2026 21:57:35 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి కళాశాలల నిరవధిక బంద్
తెలంగాణలో ప్రయివేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్ కు పిలుపు నిచ్చాయి

తెలంగాణలో ప్రయివేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్ కు పిలుపు నిచ్చాయి. ఈరోజు నుంచి పీజీ, డిగ్రీ కళాశాలలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రయివేటు డిగ్రీ కళాశాలల యాజామాన్యం ప్రకటించింది.
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయీలను...
ఇందుకు ప్రధాన కారణం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లించకపోవడమేనని వారు చెబుతున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీలు చెల్లించేంత వరకూ తాము కళాశాలలను తెరవబోమని ప్రకటించింది. సెమిస్టర్ పరీక్షలను కూడా నిర్వహించబోమని స్పష్టం చేసింది. మరి ప్రభుత్వం వీరితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
Next Story

