Sat Dec 20 2025 06:02:40 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ బంద్
నేడు తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపు నిచ్చింది. మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఈ బంద్ కు పిలుపు నిచ్చింది.

నేడు తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపు నిచ్చింది. మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఈ బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ బంద్ కు తెలంగాణ వ్యాప్తంగా స్వచ్ఛందంగా తెలంగాణకు చెందిన వ్యాపారులు మద్దతిచ్చారు. గత కొంత కాలంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో ఓయూ జేఏసీ నేడు బంద్ కు పిలుపు నిచ్చింది.
మార్వాడీ గో బ్యాక్ అంటూ...
మార్వాడీలు తమ వ్యాపారాల్లో స్థానికులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని కోరడమే కాకుండా, దాడులకు దిగడం హేయమైన చర్యగా అభివర్ణిస్తూ గత కొంతకాలంగా నడుస్తున్న ఉద్యమం నేడు బంద్ కు దారి తీసింది. అయితే బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

