Tue Mar 10 2026 23:06:59 GMT+0530 (India Standard Time)
తెలంగాణ సెట్ పరీక్ష తేదీ మార్పు
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి మూడ్రోజుల పాటు టీఎస్ సెట్ పరీక్షలు జరగాల్సి ఉంది.

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) పరీక్ష తేదీ మారింది. టీఎస్ సెట్ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం రీ షెడ్యూల్ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి మూడ్రోజుల పాటు టీఎస్ సెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 13న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
మార్చి 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 14, 15వ తేదీల్లో నిర్వహించే సెట్ పరీక్షా సమయాల్లో మార్పులు లేవని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం కోరింది. సెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
Next Story

