Wed Jan 21 2026 01:00:17 GMT+0000 (Coordinated Universal Time)
సిన్హాతో భారీ ర్యాలీగా కేసీఆర్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో భారీ స్వాగతం లభించింది.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో భారీ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులందరూ యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. ఆయనను తీసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి ర్యాలీగా జలవిహార్ కు బయలుదేరి వెళ్లారు. తన వాహనంలో తీసుకుని కేసీఆర్ యశ్వంత్ సిన్హాతో బయలుదేరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ర్యాలీ నిర్వహించింది.
మంత్రులను ...
బేగంపేట విమానాశ్రయంలో యశ్వంత్ సిన్హాకు మంత్రులు, ఎంపీలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిచయం చేశారు. అనంతరం భారీ ర్యాలీతో జలవిహార్ కు బయలుదేరారు. జలవిహార్ లో దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సిన్హా పరిచయ కార్యక్రమం ఉంటుంది. దీంతో పాటు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలన్న దానిపై కూడా వివరించనున్నారు. టీఆర్ఎస్ ఈ కార్యక్రమంతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పోటీగా జరుపుతుంది.
Next Story

