Tue Jan 20 2026 18:16:08 GMT+0000 (Coordinated Universal Time)
పరారీలోనే వనమా రాఘవ.. పోలీసుల వేట
వనమా రాఘవను అరెస్ట్ చేయాలంటూ కొత్తగూడెం, పాల్వచల్లో బంద్ కు విపక్షాలు పిలుపునిచ్చాయి.

వనమా రాఘవను అరెస్ట్ చేయాలంటూ కొత్తగూడెం, పాల్వచల్లో బంద్ కు విపక్షాలు పిలుపునిచ్చాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఇంకా రాఘవను అరెస్ట్ చేయకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. వనమా రాఘవను అరెస్ట్ చేసినట్లు నిన్న ప్రచారం జరిగింది. అయితే వనమా రాఘవను అరెస్ట్ చేయలేదని పాల్వంచ ఏసీపీ చెప్పారు. ఇంకా అతను పరారీలోనే ఉన్నారని పోలీసులు చెప్పారు.
బంద్ కు పిలుపునివ్వడంతో....
కాగా ఈరోజు ఉదయం వనమా రాఘవ నివాసం వద్ద పోలీసులు నోటీసులు అంటించారు. మరోవైపు వనమా రాఘవను అరెస్ట్ చేయాలంటూ విపక్షాలు ఇచ్చిన బంద్ విజయవంతమవుతోంది. రోడ్డుపైకి వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ ఆందోళన కారులు అడ్డుకుంటున్నారు. దీంతో పాల్వంచ, కొత్తగూడెంలలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Next Story

