Sun Mar 15 2026 15:00:33 GMT+0530 (India Standard Time)
Breaking : రెండు ఎమ్మెల్సీలూ కాంగ్రెస్ కే
నామినేషన్ గడువు పూర్తయ్యే సమయానికి కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.

ఎమ్మెల్యేల కోటా కింద రెండు ఎమ్మెల్సీల పోస్టులకు నామినేషన్ల గడువు ముగిసింది. నామినేషన్ గడువు పూర్తయ్యే సమయానికి కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరూ ఈరోజు నామివేషన్లు వేశారు.
రెండే నామినేషన్లు...
అయితే రెండు ఎమ్మెల్యేల కోటా పదవులకు ఇద్దరే నామినేషన్లు వేయడంతో ఇక వీరి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో తమ పదవులకుద రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది.
Next Story

