Thu Mar 19 2026 10:07:03 GMT+0530 (India Standard Time)
Telangana : చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. సీఎస్ పదవీ విరమణతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
మరోసారి ఉత్తర్వులు...
గత ఏడాది ఏప్రిల్ 30వ తేదీన రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను చేపట్టారు. గత ఏడాది ఆగస్టులోనే ఆయన పదవీ విరమణ చేశారు. అగతంలో ఒకసారి ఏడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. తాజాగా మరో మూడు నెలలు పొడిగస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story

