Fri Dec 05 2025 13:36:10 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తొలి రోజు రైతు భరోసా నిధులు ఎంత జమ అయ్యాయంటే?
తొలి రోజు రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది

తొలి రోజు రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఒక్కరోజులోనే 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులను జమ చేసింది. నిన్న మొత్తం ప్రారంభించిన నాలుగు పథకాలతో 6,87,677 మందికి లబ్ధి చేకూరిందని ప్రభుత్వ వర్గాలు అధికారికంగా తెలిపాయి. రైతులు, కూలీల ఖాతాల్లో ఆత్మీయ భరోసా కింద 579 కోట్లు విడుదల చేసింది.
రేషన్ కార్డులను...
18,180 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులను అందచేశారు. ఇక రాష్ట్రంలో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న 51,912 మందికి కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులకు కార్డులు మంజూరు చేశారు. 72 వేల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన పత్రాలను అందించారు. ఒకే రజులో ఇంత మందికి లబ్ది చేకూర్చడం రికార్డు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Next Story

