Sat Mar 07 2026 23:42:43 GMT+0530 (India Standard Time)
ఒమిక్రాన్.. ఒకరికి సీరియస్... గాంధీ ఆసుపత్రికి తరలింపు
ఒమిక్రాన్ వేరియంట్ తెలంగాణలో ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ మొత్తం ఇరవై ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ వేరియంట్ తెలంగాణలో ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ మొత్తం ఇరవై ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే వీరిలో ఒకరికి సీరియస్ గా ఉంది. దీంతో ఆ వ్యక్తిని టిమ్స్ నుంచి గాంధీ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించి చికిత్స అందిస్తున్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.
ఇరవై మందిలో....
వీరిని ఎయిర్ పోర్టులోనే గుర్తించి ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఇరవై మందిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని టిమ్స్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story

