Fri Mar 20 2026 13:30:07 GMT+0530 (India Standard Time)
సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం
తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం ఆగడం లేదు. తాజాగా సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక యువకుడికి ఒమిక్రాన్ సోకింది.

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం ఆగడం లేదు. తాజాగా సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక యువకుడికి ఒమిక్రాన్ సోకింది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంకు చెందని ఒక వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు. అతనిని చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆ యువకుడితో కాంటాక్ట్ అయిన ఏడుగురిని క్వారంటైన్ కు తరలించారు.
దుబాయ్ నుంచి వచ్చిన...
గూడెంకు చెందిన ఒక యువకుడు ఈ నెల 16వ తేదీన దుబాయ్ నుంచి వచ్చాడు. ఎయిర్ పోర్టులో నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అతను తన ఇంటికి చేరుకున్నారు. కానీ తర్వాత పరీక్షలు చేయించగా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అతనని హైదరాబాద్ తీసుకు వచ్చారు. అతనితో కాంటాక్ట్ అయిన పదమూడు మందిని క్వారంటైన్ కు తరలించారు.
Next Story

