Sat Dec 06 2025 16:23:48 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఒమిక్రాన్.. 20కి చేరిన కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ వణికిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 20కి చేరుకోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణలో ఒమిక్రాన్ వణికిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 20కి చేరుకోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన పది మందికి ఒమిక్రాన్ సోకిందని ఇప్పటికే నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారందరికీ చికిత్స అందిస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.
రిస్క్ దేశాల నుంచి....
ప్రధానంగా రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికే ఈ ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. కోవిడ్ నిబంధనలను పాటించాలని, అలా పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల ఫైన్ ను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విధించింది. మరిన్ని ఆంక్షలను అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది.
Next Story

