Wed Jan 21 2026 09:13:06 GMT+0000 (Coordinated Universal Time)
కన్నకొడుకులు వదిలేశారని యావదాస్తినీ ఆ తండ్రి ఏం చేశారో తెలుసా?
వృద్ధాప్యంలో కన్నకొడుకులు వదిలేశారు. దీంతో ఆ వృద్ధుడు తన ఆస్తిని కొండగట్టు ఆంజనేయస్వామికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు

వృద్ధాప్యంలో కన్నకొడుకులు వదిలేశారు. కనీసం అన్నం కూడా పెట్టడం లేదు. దీంతో ఆ వృద్ధుడు తన ఆస్తిని కొండగట్టు ఆంజనేయస్వామికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సిద్దిపేట జిల్లా కోడూరు మండలం అలీపూర్ కు చెందిన బాలయ్య అనే వ్యక్తికి కన్న కొడుకులు అన్నం పెట్టకుండా హింసిస్తున్నారు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. తన ఆస్తిని అనుభవిస్తూ తనను నిర్లక్ష్యం చేస్తున్న కన్న కొడుకులపై ఆ తండ్రికి ఎక్కడలేనీ కోపమొచ్చింది.
అంజన్న ఆలయానికి...
వెంటనే తన ఆస్తి పత్రాలతో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. తన స్థిర, చర ఆస్తులన్నింటినీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలోని హుండీలో వేసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడి సిబ్బంది అభ్యంతరం తెలిపారు. హుండీలో వేస్తే అంజన్నకు ఆస్తి చెల్లదని అక్కడి పూజారులు చెప్పడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బాలయ్య కోరగా అధికారులు దీనికి సంబంధించిన ఆస్తి పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

