Thu Mar 19 2026 00:33:40 GMT+0530 (India Standard Time)
నేడు సభపై బీజేపీ లంచ్మోషన్ పిటీషన్
రేపు వరంగల్ లో జరగనున్న బీజేపీ సభకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు

రేపు వరంగల్ లో జరగనున్న బీజేపీ సభకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో రేపు బీజేపీ బహిరంగ సభ జరగనుంది. బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ముగింపు సభను నిర్వహించాలని భావించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తమకు పోలీసు పర్మిషన్ లెటర్ అందలేదని కళాశాల ప్రిన్సిపల్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరు కానున్నారు.
సభకు అనుమతి...
నిన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రకు మాత్రమే కోర్టు అనుమతిచ్చింది. బహిరంగ సభ విషయం అందులో లేదు. పోలీసులు మళ్లీ అభ్యంతరం చెప్పే అవకాశముందని భావించిన బీజేపీ నేతలు ఈరోజు లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టులో వేయనున్నారు. సభకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. రేపటితో బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగియనుంది.
Next Story

