Fri Dec 05 2025 13:43:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మే రెండో వారంలో ఎంసెట్?
తెలంగాణ ఎంసెట్ ను ఈ ఏడాది మే నెలలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు

తెలంగాణ ఎంసెట్ ను ఈ ఏడాది మే నెలలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశ పరీక్ష తేదీలను కూడా త్వరలో ప్రకటించనున్నారు. మొత్తం ఏడు పరీక్షలకు ఎంసెట్ నిర్వహించనున్నారు. దీినకి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశముంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ మేరకు పరీక్ష తేదీలపై కసరత్తులు పూర్తి చేసింది. మే రెండో వారంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
పకడ్బందీగా...
ఎంసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి సారి ఎంసెట్ పరీక్ష నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఘటనలకు తావివద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని ఆయన గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. పరీక్ష ప్రశ్నాపత్రాల నుంచి నిర్వహణ వరకూ పకడ్బందీగా ఉండేలా చూడాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Next Story

