Sat Mar 14 2026 19:49:34 GMT+0530 (India Standard Time)
Breaking: టీఆర్ఎస్ ఎంపీ ఆఫీస్ పై ఈడీ, ఐటీ దాడులు
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆఫీసులో ఎన్ ఫో్ర్స్ మెంట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆఫీసులో ఎన్ ఫో్ర్స్ మెంట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదారాబాద్ శ్రీనగర్ కాలనీలోన రవిచంద్ర ఆఫీసులో ఈడీ, ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. దాదాపు 11 గంటలకు ఈ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లోనూ ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
కక్ష సాధింపు....
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి ఇటీవల ఎన్నికయ్యారు. ఆయన ఆఫీస్ పై ఐటీ, ఈడీ దాడులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈ దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Next Story

