Sun Dec 08 2024 09:59:47 GMT+0000 (Coordinated Universal Time)
Congress : భారీగా చేరికలు.. కండువాలు కప్పుతూ
కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఢిల్లీకి వెళ్లి మరీ నేతలు పార్టీలో చేరుతున్నారు.
కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఢిల్లీకి వెళ్లి మరీ నేతలు పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించిన నేతలు ఎక్కువ మంది ఢిల్లీలోని ఏఐసీసీ భవన్ వద్ద క్యూ కట్టారు. కాంగ్రెస్ కండువాలను కప్పేసుకుంటున్నారు. టిక్కెట్లు ఇంకా ఖరారు కాకపోవడంతో చివరి నిమిషంలో తమ పేర్లు చేరకపోతాయా? అన్న ఆశతో కొందరు... ఇప్పటికే టిక్కెట్లు ఖరారయిన మరికొందరు నేతలు పార్టీలో చేరిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళకళలాడుతుంది.
చేరిన వారిలో...
ఈరోజు ఏఐసీసీ ఛైర్మన్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, ఏనుగు రవీందర్ రెడ్డి, నీలం మధులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వారికి మల్లికార్జున ఖర్గే, పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రేలు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరిలో కొందరికి రెండో జాబితాలో టిక్కెట్లు ఖరారయ్యే అవకాశాలున్నట్లు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రచారం జరుగుతుంది.
Next Story