Tue Dec 09 2025 07:57:02 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో తగ్గని కరోనా
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజుకు ఐదు వందల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజుకు ఐదు వందల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా 493 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలేవీ సంభవించలేదు. మొత్తం 29,084మంది నమూనాలను పరీక్షించగా కొత్తగా 493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 219 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో 3,322 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు గత వారం రోజులుగా పెరుగుతున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరుతుంది దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు తెలంగాణలో కూడా వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక్క హైదరాబాద్ లోనే 366 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ వాసులు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యఆరోగ్యశాఖ సూచిస్తుంది.
Next Story

