Sun Oct 13 2024 20:45:16 GMT+0000 (Coordinated Universal Time)
భారీ ఎన్టీఆర్ భారీ విగ్రహం
ఈ నెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు.
ఈ నెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడి రూపంలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహం కూడా తుది మెరుగులు దిద్దుకుంది.
నాలుగు కోట్ల వ్యయంతో...
అయితే ఈ విగ్రహాన్ని యాభై నాలుగు అడుగులతో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ విగ్రహావిష్కరణకు ప్రాధాన్యత ఉంది. రాజకీయాలకు అతీతంగానే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు, ట్యాంక్ బండ్ కు ఈ విగ్రహం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తానా అసోసియేషన్ తో పాటు అనేక మంది విగ్రహ ఏర్పాటుకు సహకారం అందించారు.
Next Story