Fri Dec 05 2025 16:01:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీఆర్ఎస్ నేతల బస్సుపై కోడిగుడ్ల దాడి.. నల్లగొండ జిల్లాలో టెన్సన్
నల్లగొండలోని వీటీ కాలనీలో బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు

నల్లగొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండలోని వీటీ కాలనీలో బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నల్లచొక్కాలు వేసుకుని నిరసనలు తెలియజేశారు. గో బ్యాక్ అంటూ బస్సు అద్దాలపై కోడిగుడ్లు విసిరారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
ఎన్ఎస్యూఐ కార్యకర్తలు...
అయినా వారు పోలీసు వలయాన్ని ఛేదించుకుని మరీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బస్సుకు అడ్డంగా నిలుచున్నారు. బీఆర్ఎస్ నేతలు వెనక్కు వెళ్లాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. నల్లగొండ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరిన సంగతి తెలిసిందే.
Next Story

