Sun Mar 15 2026 22:08:26 GMT+0530 (India Standard Time)
మండలి పదవులకు నేడు నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ లకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది.

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ లకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. రేపు నామినేషన్ల అనంతరం ఎన్నికల జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసమండలిలో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయనున్నారు. రెండు కేబినెట్ హోదా కలిగిన పదవులు కావడం, కీలకం కావడంతో ఈ పదవుల కోసం అధికార టీఆర్ఎస్ లో పోటీ పెరిగింది.
రెండు పదవులకు......
ప్రస్తుతం శాసనమండలి సమావేశాలు జరగుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మండలి ఛైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్ ను నియమిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద రెండు కీలకపదవుల భర్తీపై అధికార టీఆర్ఎస్ లో ఆసక్తి నెలకొంది.
Next Story

