Wed Mar 18 2026 11:16:31 GMT+0530 (India Standard Time)
తెలంగాణ హైకోర్టులో 1226 ఉద్యోగాలు
తెలంగాణ పరిధిలోని కోర్టుల్లో 1,226 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది

తెలంగాణలో నిరుద్యోగ యువతకు వరసగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా తెలంగాణ పరిధిలోని కోర్టుల్లో 1,226 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అయితే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఏడో తరగతి నుంచి పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
విద్యార్హత...
పదో తరగతికి మించి పాసైన వారు ఈ పోస్టులకు అర్హులు కారని పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే 2022 జులై 1నాటికి 18 నుంచి 34 సంవత్సరాల వయసు లోపు ఉండాలి. అలాగే స్థానిక భాషపై పట్టు కూడా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Next Story

