Fri Dec 05 2025 16:39:18 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ కు నోటీసులు... నేటితో ముగియనున్న గడువు
ఛత్తీస్గడ్ నుంచి విద్యుత్తు ను కొనుగోలు చేసిన విషయంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు.

ఛత్తీస్గడ్ నుంచి విద్యుత్తు ను కొనుగోలు చేసిన విషయంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఆ గడువు నేటితో ముగియనుంది. ఛత్తీస్గడ్ లో విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కోరారు. అందుకు తనకు జూన్ 30వ తేదీ వరకూ గడువు కావాలని కేసీఆర్ కమిషన్ ను కోరగా అందుకు కమిషన్ తిరస్కరించింది.
ఛత్తీస్గడ్ లో విద్యుత్తు కొనుగోలు...
జూన్ 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కోరారు. ఛత్తీస్గడ్ లో విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై వివరణకు ఈరోజుతో గడువు ముగియనుంది. ఈరోజు కేసీఆర్ కమిషన్ కు వివరణ పంపేందుకు అవకాశాలున్నాయి. సాయంత్రంలోగా వివరణ పంపేందుకు కేసీఆర్ సిద్ధమయినట్లు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కేసీఆర్ పంపే వివరణతో సంతృప్తి చెందకపోతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
Next Story

