Fri Dec 05 2025 17:37:39 GMT+0000 (Coordinated Universal Time)
నో స్టాక్.. వినియోగదారుల అవస్థలు
తెలంగాణ వ్యాప్తంగా పెట్రోలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనపడుతున్నాయి. గడచిన వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది

తెలంగాణ వ్యాప్తంగా పెట్రోలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనపడుతున్నాయి. గడచిన వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించుకోవడంతో పెట్రోలు బంకులు యాజమాన్యం ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. డీలర్లు కావాలనే కృతిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
డిమాండ్ కు తగిన సప్లయ్....
అయితే డిమాండ్ కు తగిన సప్లయి లేకపోవడం వల్లనే తాము పెట్రోలు బంకులు మూసివేశామని బంకుల యాజమాన్యం చెబుతుంది. ముఖ్యంగా హెచ్పీసీఎల్, ఐవోసీల్ పెట్రోలు సంస్థలు నగదు ఇవ్వాలని పట్టుబట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొందని డీలర్లు చెబుతున్నారు. గతంలో క్రెడిట్ ప్రాతిపదికన పెట్రోలు, డీజిల్ సరఫరా చేస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ రెండు సంస్థలు నగదు ఇవ్వాలని పట్టుబట్టడం, మూడు రోజులు ముందుగా నగదు చెల్లిస్తేనే పెట్రోలు సరఫరా చేస్తామని చెబుతుండటంతోనే నిల్వలు నిండుకున్నాయని డీలర్లు చెబుతున్నారు.
Next Story

