Sat Mar 07 2026 17:31:20 GMT+0530 (India Standard Time)
నిమ్స్ లో దారుణం.. డెడ్ బాడీని లిఫ్ట్ పక్కన వదిలేసిన సిబ్బంది
ఆస్పత్రిలోని లిఫ్ట్ పక్కన డెడ్ బాడీ ఉండటం కలకలం రేపింది. మార్చురీలో ఉండాల్సిన డెడ్ బాడీని సిబ్బంది..

హైదరాబాద్ : నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని లిఫ్ట్ పక్కన డెడ్ బాడీ ఉండటం కలకలం రేపింది. మార్చురీలో ఉండాల్సిన డెడ్ బాడీని సిబ్బంది లిఫ్ట్ పక్కన వదిలేసినట్లు తెలుస్తోంది. డెడ్ బాడీ ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు తెల్లటి బట్టను అడ్డుగా పెట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లు ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనపై నిమ్స్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story

