Thu Mar 19 2026 10:03:27 GMT+0530 (India Standard Time)
కరీంనగర్లో ఎన్ఐఏ సోదాల కలకలం
కరీంనగర్ నగరంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో గురువారం తెల్లవారు జామున

కరీంనగర్ నగరంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో గురువారం తెల్లవారు జామున నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టింది. తబ్రేజ్ అనే వ్యక్తికి నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన పీఎఫ్ఐతో గతంలో సంబంధాలు ఉన్నాయనే అనుమానాల నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు.. కరీంనగర్ హుస్సేనీపురాలోని అనుమానితుడి ఇంటికి చేరుకుని తెల్లవారుజాము నుంచి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. తబ్రేజ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నట్లు గుర్తించిన అధికారులు.. ఉదయం నుంచి అతని ఇంట్లో సోదాలు చేస్తున్నారు. తెల్లవారు జామున 3-30 గంటలకి తబ్రేజ్ ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ అధికార బృందం.. 8-30 వరకు ఇంట్లో సోదాలు నిర్వహించింది. దాదాపు ఐదు గంటల పాటు తబ్రేజ్ ఇంటిని అధికారులు జల్లెడ పట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
Next Story

