Sat Mar 07 2026 21:20:27 GMT+0530 (India Standard Time)
Telangana : నేటి నుంచి ప్రజావాణి
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుంది

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుంది. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు నేటి నుంచి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనికి ప్రజావాణిగా నామకరణం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ప్రారంభం కానుంది.
వినతుల స్వీకరణ....
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను కలెక్టర్లు, ఎమ్మెల్యేలు స్వీకరిస్తారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు ప్రారంభిస్తారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను మాత్రం రాష్ట్ర స్థాయి అధికారులకు పంపుతారు. దీంతో నియోజకవర్గాల్లో ప్రజలు తమకున్న సమస్యలను స్థానిక అధికారులకు చెప్పుకునే వీలు కలిగింది.
Next Story

