Sat Mar 07 2026 19:36:26 GMT+0530 (India Standard Time)
మునుగోడుకు వెళ్లను... ప్రచారం చేయను
మునుగోడు ఉప ఎన్నికలకు ప్రచారం వెళ్లబోనని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నికలకు ప్రచారం వెళ్లబోనని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను హోంగార్డునని, ఎస్పీస్థాయి వారు వెళ్లి మునుగోడు ప్రచారానికి వెళతారని ఆయన అన్నారు. తనను హోంగార్డుగా అన్న వారు మునుగోడు ఉప ఎన్నికలలో పార్టీని గెలిపించుకుంటారన్నారు. గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు.
ఆయనే గెలిపిస్తాడులే....
తనపై వంద కేసులు పెట్టినా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పిన ఆయన మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పార్టీని గెలపించుకు వస్తారని, తనలాంటి కార్యకర్తలతో ఏం పని అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కడియంకు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. తాను విదేశాలకు ఎప్పుడు వెళతానన్నది కేటీఆర్ ను అడిగి తెలుసుకోవాలని ఆయన చెప్పారు.
Next Story

