Sat Mar 07 2026 19:52:29 GMT+0530 (India Standard Time)
TDP : టీడీపీ అన్ని అన్ని కమిటీలు రద్దు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వచ్చారు. తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వచ్చారు. తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. మూడు గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు.
పార్టీ సభ్యత్వాలను...
అయితే ఇప్పటి వరకూ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సభ్యత్వాలపై పూర్తిగా దృష్టి పెట్టాలని చంద్రబాబు పార్టీ నేతలను కోరారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని, పెద్దయెత్తున సభ్యత్వాలు నమోదు చేయించిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టీడీపీకి మంచి భవిష్యత్ ఉందని ఆయన తెలిపారు.
Next Story

