Thu Mar 19 2026 05:48:48 GMT+0530 (India Standard Time)
తెలంగాణ సర్కార్ పై ఎన్జీటీ ఆగ్రహం
తెలంగాణా ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణా ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నూతన సచివాలయం నిర్మాణంపై పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. కొత్త సచివాలయం నిర్మాణంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దీనిపై ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పర్యావరణ అనుమతులను...
తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయాన్ని కూల్చి వేసి ఐదు వందల కోట్ల వ్యయంతో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టింది. దీనిపై మూడు వారాలు గడువిస్తున్నామని, ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Next Story

