Fri Dec 19 2025 11:00:22 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : 11న హైదరాబాద్ కు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో పాల్గొనున్నారు.

ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మాదిగ విశ్వరూప సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని సభ విజయవంతం చేయడానికి బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ నేతలు స్పీడ్ పెంచారు. అగ్రనేతల పర్యటనలు ఖరారవుతున్నాయి. మోదీ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ కు వచ్చి ఎల్.బి స్టేడియంలో జరిగిన బీసీ సదస్సులో పాల్గొని వెళ్లారు. పెద్దయెత్తున జనం తరలి వచ్చారు.
విశ్వరూప సభలో...
ఇక తాజాగా మాదిగ విశ్వరూప సదస్సుకు హాజరవుతున్నారు. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మాదిగ సామాజికవర్గం దీర్ఘకాలంగా రిజర్వేషన్ల కోసం పోరాడుతుంది. దీనిపై ప్రధాని ఏదైనా ప్రకటన చేస్తారేమో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించి వెళ్లారు. పసుపు బోర్డుతో పాటు గిరిజన యూనివర్సిటీని కూడా ప్రకటించడమే కాకుండా వెంటనే జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించేశారు.
Next Story

