Thu Dec 11 2025 14:11:10 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : తెలంగాణ ఎంపీలకు మోదీ క్లాస్
తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు తెలిసింది

తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు తెలిసింది. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేక పోతున్నారని మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మోదీతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. తెలంగాణ బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరని, బీజేపీ కంటే అసదుద్దీన్ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్నారని మోదీ అన్నట్లు సమాచారం. గత ఎన్నికలలో వచ్చిన అవకాశాన్ని వదులుకునే విధంగా తెలంగాణ బీజేపీ ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మోదీ అన్నారని తెలిసింది.
బీజేపీ బలోపేతం కావడానికి...
తెలంగాణలో బీజేపి బలోపేతం కావడానికి మంచి అవకాశాలున్నప్పటికీ ఆ రకమైన ప్రయత్నాలేవీ జరగడం లేదని అసంతృప్తి జరగనున్నట్లు తెలిసింది. ఖేల్ సంసద్ పోటీలు నిర్వహంచాలని, యువతను పార్టీలో భాగస్వామ్యం చేసే విధంగా వ్యవహరించాలని కోరినట్లు చెబుతున్నారు. ఒక్కో ఎంపీ సోషల్ మీడియా రీచ్ పై మోదీ ప్రత్యేకంగా సీల్డ్ కవర్ లో మోదీ ఎంపీలకు ఇచ్చినట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన ఫలితాలను సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. మంచి టీంను పెట్టుకుని సమర్ధవంతంగా పనిచేయడానికి ఎందుకు ప్రయత్నించరని మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ పీకినట్లు తెలిసింది. తెలంగాణ ఎంపీలతో సమావేశం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
Next Story

