Fri Dec 05 2025 15:23:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించంది.

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించంది. సురేఖపై ఈ నెల 21వ తేదీ లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పరువు నష్టం దావా వేశారు.
ప్రాధమిక సాక్ష్యాలను పరిశీలించిన...
ప్రాధమిక సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం నాంపల్లి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్ ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని అభిప్రాయ పడింది. సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి, ఇతర అంశాలపై సుఖ తరుపు న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారన్న ఆయన తరుపున న్యాయవాది చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించి ఈ ఆదేశాలను జారీ చేసింది.
Next Story

