Mon Dec 15 2025 00:10:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కొండా సురేఖకు కోర్టు సమన్లు
కొండా సురేఖకు సమన్లు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు హైకోర్టు షాకిచ్చింది. ఆమెపై నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మంత్రి సురేఖకు సమన్లు జారీ చేసింది. కాగా తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
నాగార్జున పిటీషన్ పై...
తమను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో పాటు తమ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా నాగార్జున తన పిటీషన్ లో కోరారు. దీంతో నాంపల్లి కోర్టు కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 12 కోర్టుకు హాజరు కావాలని కోరింది.s
Next Story

