Fri Jan 30 2026 02:33:16 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇద్దరు పూచికత్తు సమర్పించాలని, ముప్ఫయివేల రూపాయలను సమర్పించాలని, పాస్‌పోర్టును కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని, విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు న్యాయస్థానం అనుమతి తీసుకునే వెళ్లాల్సి ఉంటుందని న్యాయస్థానం తీర్పు చెప్పింది.
షరతులతో కూడిన...
నిన్న పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. షరతులన్నీ సాయంత్రంలోగా పూర్తి చేస్తే షర్మిల ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో షర్మిల ఉన్నారు. మే 8వ తేదీ వరకూ ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
- Tags
- ys sharmila
- bail
Next Story

