Sat Jan 31 2026 00:22:41 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
టీఆర్ఎస్ పన్నెండు మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ పన్నెండు మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయినట్లు తెలుస్తోంది. రేపు పన్నెండు మంది టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లను వేయనున్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళుతూ పన్నెండు మంది పేర్లను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి కొత్తవారికి ఈసారి అవకాశం కల్పించారని తెలుస్తోంది. నిజామాబాద్ లో కల్వకుంట్ల కవితకు అవకాశం కల్పించలేదు. ఆమెను రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థల కోటాలో పన్నెండు మంది ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది.
కరీంనగర్ - ఎల్ రమణ, భానుప్రసాద్
నిజామాబాద్ - ఆకుల లలిత
మహబూబ్ నగర్ - సాయిచంద్ (గాయకుడు)
ఆదిలాబాద్ - దండె విఠల్
మెదక్ - భూపాల్ రెడ్డి లేదా య ాదవ రెడ్డి
ఖమ్మం - తాత మధు తుమ్మల నాగేశ్వరరావు
మహబూబ్ నగర్ - కసిరెడ్డి నారాయణరెడ్డి
నల్లగొండ - సి. కోటిరెడ్డి
రంగారెడ్డి - శంభీపూర్ రాజు, పట్నం మహీందర్ రెడ్డి
Next Story

